'ఓరుగల్లు, పోరుగల్లు' అంటుంటారు. తెలుగు పౌరుషానికి, ఆత్మగౌరవానికి, కళల అభివృద్ధి రాయలెంతటివాడో ప్రతాపరుద్రుడు అంతటివాడే. కాకతీయ రాజులలో, రుద్రమ వీరనారి కాగా, ప్రతాప రుద్రుడు స్వయంగా యోధుడు. ఇక గణపతి దేవ చక్రవర్తి ప్రజాహిత పాలనలో ముందున్న వాళ్లు. తమ పాలనలో వ్యవసాయానికి, ఫలసాయానికి పెరెన్నిక గన్న 'పానేలు, రామప్ప, లక్నవరం, వంటి అతిపెద్ద తటాకాలు, వీరి పాలనలోనే నిర్మించారు. వీరు ఒకరిని మించి మరొకరు పౌరుషాన్ని ప్రదర్శించారు.
కాకతీయ ప్రభువు గణపతి దేవుడే ( క్రీ.శ. 1190) పాలనాదక్షుడుగా పేరుపొంది ప్రజ మన్ననల పొందినవాడు. రుద్రమ దేవి (క్రీ.శ. 1262) ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289 -1329) వరకు పరిపాలించారు. కాకతీయ పరిశోధకుల అభిప్రాయం, అ.... చరిత్రలో నిలిచిపోయే పాలన అందించినారు.
వీరి కాలంలోనే, పాల్కురికిసోమన బసవ పురాణం -శ్రీనాథుని 'క్రీడాభిరామా' విద్యానాధుటి, ప్రతాపరుద్రయు, ఏకామ్రనాథుని, 'ప్రతాపరుద్రచరిత్ర' రచించారు. వాటి వల్ల మనకు చారిత్రక వాస్తవ పరిస్థితులు కొన్ని తెలుస్తాయి. నాడు గ్రామదేవతలు, ఏకవీర, నేటి 'ఎల్లమ్మ, రేణుక ప్రతిరూపంగా పూజించారు, మతసామరస్యం వెల్లివిరిసింది.
కులముదైవతంబు గురిజాల గంగాంబ, కలని పోతులయ్య, అనే పద్యం వల్ల గంగాంబ (గంగమ్మ) పోతులయ్య (పోతురాజు కావచ్చు) పూజలందుకున్నారని భావించాలి.
జానపద కళాకారులుండేవారని ''పరుశురాముని కథలెల్ల పౌడిపాడె'' పద్యపాదం వల్ల ''బవనీల చక్వర్తి'' అనటం బ్రెయిండ్లవాళ్లు ఈ గాథలు పాడేవాళ్లని తెలుస్తుంది. 'కాకతమ్మను పూజించేవాళ్లు' ఈ దేవత పేరనే, వీరి వంశం కాకతీయ వంశంగా పరిగణించారని గమనించాలి. 'తమ్మళ్లు' పూజారులుగా ఉండేవారని బసవ పురాణం చెబుతుంది.
ఆయుధాలు: రాగి, ఇత్తడి, కంచు వంటి వాటితో చేసుకునేవారు.
రాగి, ఇత్తడి, కంచుపెట్టి చేసినట్టి బిరుదులు కలవు'' అని ప్రతాపరుద్రయా పేర్కొంది.
కాకతీయ ప్రభువులు, మువ్వురు, అరివీరభయంకరులే పది లక్షల సైన్యం సమకూర్చుకున్నారట. ఓరుగల్లు కోట పటిష్టంగా ఉండేది. నేటి నాటి ఆనవాళ్లున్నాయి. ఇక్కడి సుప్రసిద్ధమైన ''కాకతీయ ద్వారం'' నాటి సాంఘిక, రాజకీయ జీవనాన్ని ప్రతాపరుద్ర చరిత్ర వివరిస్తుంది. అయితే ఇందులోని కొన్ని విషయాలు వాస్తవం కాదని చరిత్రకారుల వాదన. అయితే గ్రంథం చాలా గ్రంథాలకు ప్రేరణగా మాత్రం నిలిచిపోయింది.
కాకతీయ వంశానికి ముందు పాలకుల గురించి ఈ గ్రంథం వివరిస్తుంది. అంతేకాదు కాకతీయ పాలకులలో మూల పురుషులను వర్ణిస్తుంది.
''(విభువనైక మల్లునకు కాకతిదేవి వరప్రసాదంబున కాకతిప్రోలరాజను నొక్క సుతుడు జన్మించెను'' -అని పూర్వవృత్తాంతం వివరించాడు. ఏకామ్రనాథుడు ఈయనే, (పోలరాజు) 'ఓరుగల్లు పురం' నిర్మించాడని. ''శుభక్రయనామ సంవత్సర కార్తీక మఖ, గురువారం రోహిణి నక్షత్రంబున ఓరుగల్లు పట్టమంబు గట్టిరి'' అని విథి, వార, నక్షత్రాలతో సహా మనకు అందించాడు. శాలివాహన శకం 1059 -లో గణపతి దేవుడు సింహనాథీశుడయ్యడని చెబుతాడు.
ఈయన, ఓరుగల్లుకు యోజన దురంలో, ఓ మహాతటాకాన్ని నిర్మించాడని దానికి ఈశాన్యభాగంలో షణపురంబన పురాకట్టించెను'' నేటికి, స్టేషన్‌గణపురం -గణపురం చెరువు ఉన్నాయి.
గణపతి దేవుని ఆరాధ్యం దేవత 'పద్మాక్షి' ఈ మహాతల్లి పేర దేవాలయం గుట్ట, హనుమకొండ వద్ద చూడవచ్చు. ఈయన నిర్మాణమే, అని భావించాలి. అయితే ఈ దేవాలయం సురవరం వారు పేర్కొన్నారు.
రుద్రమ
కోటలు కట్టించింది, నీటి సరఫరా కావించింది. సత్రాలు నిర్మించింది. ఐదువేల విప్రులకు వివాహాలు జరిపించింది. కాకతమ్మకు జాతరలు కొలుపులు నిర్వహించేదట. మొగిలివరష (నేడుంది) ఏకవీరదేవికి, మైలారపు (నేడుంది) దేవునికి, మహోత్సవాలు చేయించింది. వేయి రుద్ర నగరాలు తన పేర నిర్మించిందట. ఈమె కుమార్తె 'ముమ్మమ్మ, కుమారుడే ప్రతాపరుద్రుడు'
''శివదేవయ్యతో బాలుడైన ప్రతాపరుద్రునికి విభూతి ధరింపచేసిందని చెప్పుటవల్ల కాకతీయ ప్రభువుల్లో వీరు శైవులని తెలుస్తుంది. హనుమకొండలోని వేయిస్తంభాల మంటపంలో ఎత్తైన శివలింగం నేటికి చూడవచ్చు. -ఇది శివాలయమే.
ప్రతాప రుద్రుడు (1215 -1282) -దిగ్విజయయాత్రలు చేసి, వింధ్య వరకు రాజ్యాన్ని విస్తరింపచేశాడు. ఇతని కాలంలో కులవృత్తులు అభివృద్ధిలోకి వచ్చాయి. పద్మనాయకులు, విశ్వకర్మలు, వేపులు, ఈడుగలు, మేదరులు, కాక చిత్తరువులు వేసేవాళ్లు విడిగా ఉండేవారని తెలుస్తుంది. బెస్తలు -రాజకులు ఉండేవాళ్లు వర్షాలు కురవాలి, శైవస్తోత్రాలు పఠించి, ఉవాస దీక్ష ఉండేవాడట. ఆయన భక్తిమెచ్చి శివుడు బాగీరథ జలాలతో ఓ ప్రాంతంలో అమరవర్షం కురిపించాడట. ఇదే ప్రస్తుతం -'కాశీబుగ్గ' పేర ఉన్న ఊరు కావచ్చు.
ఈ మువ్వురి పాలనలోనే శిల్ప, చిత్రకళలు, అభివృద్ధిలోకి వచ్చి, కాకతీయ ప్రభువులు కళానిధులన్న ప్రశంస పొందారు. వీరి ఖ్యాతికి నిదర్శనం, వరంగల్‌కు సుమారు నలబై మైళ్ల దూరంలోని రామప్పదేవాలయాలు -వీటిని కాకతీయుల సామంతరాజు రుద్రసేనాన్ని నిర్మించాడని చరిత్ర కారుల అభిప్రాయం. ఈ దేవాలయంలోని మనోహర శిల్పాల్లో 'నాగిని' శిల్పం, నల్లరాయిపై చెక్కినది. చూపరులకు ఆనందం కలిగిస్తుంది. ఈ దేవాలయంపై ఏకంగా కవులు పద్యాలు కవితలు అల్లగా, ఈ గుడిలోని కృత్యరీతుల ఆధారంగా ప్రముఖ నర్తకులు, నట రాజరామకృష్ణ 'పేరిణి శివతాండవ' నృత్యరూపకమే నిర్మించాడు. వీరికి మూలం, జాయపనసేనాని, నృత్తశాస్త్ర, ఆధారంగా ఈ శిల్ప నిర్మాణం జరిగిందని చెబుతారు. ఇంకా, మహబూబ్‌నగర్, సూర్యపేట ప్రాంతాల్లోని శివాలయాలు వీరి కాలంలో నిర్మించినవేనట. నాడు సామాన్యుల ఇండ్లలోకూడా గోడలపై చిత్రాలు చిత్రించేవారట. ఇళ్లు అందంగా ఆలంకరించుకొనేవారని. క్రీడాభిరామంలో ఆధారాలున్నాయి. పట్టువస్త్రాలకు పెట్టింది పేరు 'బసవపురాణం' ఇందులోని ఇరువై రకాల వస్త్రాల పేర్లు ప్రస్తావించింది. సన్నని వస్త్రాలు ఉండేవని, వాటి విలువ ఎక్కువని మార్కొవోలో అను యాత్రికుడు పేర్కొన్నాడు. ఈ విధంగా కాకతీయ ప్రభువులు కళా రంగంలోను, పాలనారంగంలోను, ప్రసిద్ధి
పొందారు. నేటి తరానికి, ఈ మహామహులు ఉత్సవాలు జరిపి గుర్తుచేయాలి. అది ప్రభుత్వధర్మం
No comments:
Post a Comment