గ్రామంలో దెయ్యం వచ్చి చేరిందని చెప్పిన ఆ మాంత్రికుడు ఆ గ్రామానికి సంబంధించని ప్రజలను వెంటనే ఊరినుంచి వెళ్లిపోవలసినదిగా ఆదేశించాడు. మిగిలిన గ్రామస్తులు తాను ఊరి గుడిలో చేపట్టే పూజా కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని హుకుం జారీ చేశాడు.
చిట్టచివరకు గ్రామం నుంచి దెయ్యాన్ని పారదోలే ప్రక్రియ ప్రారంభమైంది. మంత్రగాడు విచిత్రమైన చేష్టలు మొదలెట్టాడు. ఇతరులు చూడగానే భయంతో కంపించిపోయే రకం బట్టలు ధరించి, ఆ ఊరు చుట్టూ పాలు పోసి గీత గీశాడు. చివరగా ఆ ఊరునుంచి దెయ్యాలను వదలగొట్టేశానని ప్రకటించేశాడు. దీంతో గ్రామస్తులు అతడిని పొగడటం మొదలెట్టారు.
|
మానవ స్వభావమే అంత. తనకు తెలియని, తనకు అర్థంకాని విషయాల వద్దకు వచ్చేసరికి మనిషి తప్పనిసరిగా వాటికి అతీత శక్తులతో ముడిపెట్టడం మొదలెడుతాడు. అయితే దీన్ని ఒక అవకాశంగా తీసుకుని స్వప్రయోజనాలకోసం ఉపయోగించుకునే వారు ఎక్కడైనా సరే తయారై ఉంటారు. అమాయకుల నమ్మకాలను వీరు తమకు అనువుగా మలుచుకుంటారు. ఒక్కోసారి ఇది ఇలాంటివారికి పెద్ద ఆదాయవనరుగా మారుతుంది కూడా.
ఇంతకూ.. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు... ఇలాంటి విషయాలను మీరు నమ్ముతున్నారా... మీ అభిప్రాయం మాకు తప్పక రాయండి..