Total Pageviews

Monday, June 17, 2013

k y v

ఈయుగాన ధర్మం మూడు పాదాలపై నడి చింది. సత్యనిష్ఠతో ప్రజలు, పాలకులూ ఉండేవారు. యజ్ఞ, జప, తపస్సులు, ధర్మకార్యాల పట్ల ఆసక్తులై ఉండేవారు. ఈ యుగాన శ్రీ మహావిష్ణువు ఎర్రనిరంగు కలవాడై లోకాలను పాలించాడు.
ద్వాపర యుగానికి వస్తే ధర్మం రెండు పాదాలపైనే నడుస్తోంది. ఈ యుగాన ప్రజలు, పాలకులు అబద్ధాలు చెప్పేందుకు ఎటువంటి సంకోచాలు చెందరు. నిగ్రహం కోల్పోతారు.
కోరికలు, కోపాలతో నిండిపోతారు. అదే జీవితంగా భావిస్తారు. ఈ యుగాన సత్య నిష్ఠలను వదలి కోరికలతోనే యజ్ఞ యాగాదులు నిర్వహిస్తారు. వైకుంఠ వాసుడైన మహావిష్ణువు నల్లనివర్ణుడై ప్రజలను పాలిస్తుంటాడు.
ఇక కలియుగంలో ధర్మం పూర్తిగా తగ్గి పోతుంది. కేవల ఒక్క పాదంతోనే ధర్మం సంచరిస్తుంది. మహావిష్ణువు పచ్చని కాంతితో లోకాన్ని పాలిస్తాడు.
ఈ కాలంలో ప్రజలు, పాలకులూ కామ క్రోధాదులతో యధేచ్ఛగా సంచరి స్తారు. భయమూ, భక్తీ అవసరానికే ఉపయోగిస్తారు. ధర్మం చెప్పే వాళ్లే కాని, చేసేవాళ్లు తక్కువ. దానివల్లే ఆ యుగంలో యజ్ఞ యాగాదులు చేసిన వారికి ఎక్కువ ఫలితం వస్తుంది.
ధర్మమన్నది, సత్యనిష్ఠలన్నవి మాటల వరకే. చేతల్లో అంతా స్వార్థం, మోసమే కనిపిస్తాయి.
అదీ సోదరా నాలుగు యుగాల విశేషప్రవర్తనలు. నీవు ఇక వెనక్కి మరలిపో. ముందుముందు నీవు సంచరించలే''వన్నాడు హనుమంతుడు భీమునితో.
భీమసేనుడు హనుమంతునికి నమస్కరించి తన దృఢ సంకల్పాన్ని విడిచి పెట్టనని ఇలా అడిగాడు.
''మహానుభావా! మీ సందర్శనంతో పులకించిపోతున్నాను. నీ మహా విశ్వ భవదీయ నిజస్వరూపాన్ని చూడాలని, నా కోరిక మన్నించమని మళ్లిd మళ్లిd ప్రార్థిస్తున్నాను'' అన్నాడు.
భీమసేనుడి పట్టుదలకు, భక్తికీ మెచ్చి హనుమ తన నిజ, స్వరూపాన్ని చూపించాడు.
ఆ మహా శూరాధిశూరుని దేహం మేరునగరంలా మెరిసి పోయింది. అలా... అలా... పెరిగిపో సాగింది. చూస్తుండగానే ఆకాశాన్ని తాకింది. మహోగ్రమైన లోకాలను ఆక్రమిస్తున్నట్టు ఎదిగిపోతున్న ఆంజనేయుని భీకరరూపాన్ని చూడలేక భీముడు గజగజ వణికిపోతూ...
''శ్రీరామ భక్తా! హనుమా... వద్దు.. ఇక చాలు. నా వల్ల కాదు. నీ పూర్తి స్వరూపాన్ని చూసే శక్తి నాకు లేదు. భూన భోంతరాలు అంతా విస్తరిస్తున్న నీ మహా విశ్వరూపాన్ని నేను చూడలేక పోతున్నాను. దయతో ఉపసంహరించు'' అని ప్రార్థించాడు.
హనుమంతుడు భీమసేనుడి కోరికతో తన ప్రస్తుత స్వీయ రూపం ధరించాడు.
''భీమసేనా! శత్రువు బెదురుతున్నప్పుడు నా రూపం అంతకు రెండింతలవుతుంది'' అన్నాడు.
భీమసేనుడు తన్మయుడై హనుమను అడిగాడు.
''అంజనీపుత్రా! నాదో సందేహం. అపార పరాక్రమశాలి వైన నీవే రావణసంహారం జరిపించకుండా శ్రీరాముడు తానే ఎందుకు రావణుణ్ని సంహరించాల్సి వచ్చింది. లంకా పురిని నేలమట్టం చేసి దశకంఠుణ్ని యమపురికి పంపవచ్చు కదా?'' అని సంశయాన్ని వ్యక్తం చేశాడు.
''భీమసేనా! శ్రీరాముని శక్తిముందు నేనెంత? నా ఈ శక్తంతా శ్రీరాముని నామస్మరణ వల్లనే వచ్చింది. ధర్మ సంస్థాపన చేయాల్సింది, చేసింది నా శ్రీరాముడే. సరే! ఆ గూఢ ధర్మశక్తి విషయాలకేం గానీ, నాదొక్క మాట విను. సౌగంధిక పుష్పాల కోసం వెళ్లిన చోట ఎలాంటి దూకుడు కార్యాలకూ తలపడ వద్దు.
యక్షగంధర్వులు నిత్యం కాపలా కాసే దివ్య సరోవరం, దేవేతలు జలక్రీడలు ఆడే సౌగంధిక సరోవరం.
దేవతలు ఎప్పుడూ భక్తికే లొంగు తారు. మహా యజ్ఞాల వల్ల, హోమాల వల్ల, బలుల వల్ల మాత్రమే సంతృప్తులవు తారు. శౌర్య పరాక్రమాలతో వారిని జయించడం, ఎదిరిం చడం బహుకష్టం. సంకల్పాన్ని దీక్షబూని విజయం సాధించు.
సకల వేదవేత్తలైన పండి తులను ఆశ్రయించి ఆచరించి నప్పుడే ధర్మసూక్ష్మం అవగత మవుతుంది. అలాంటి ధర్మం వల్లనే యజ్ఞయాగాదులు అభివృద్ధి చెంది పుణ్యమనే అమృతం అందుతుంది. అలాంటి వేద జ్ఞానంద్వారా చేసే యజ్ఞాలే దేవతలకు సంతృప్తి నిస్తా'' యంటూ భీమునికి మంచిమాటల్ని ఉద్బోధిస్తున్నాడు