Total Pageviews

Friday, October 15, 2010

యుగాన్ని బట్టి ధర్మం -కాలాన్ని బట్టి ఉద్యోగం




కాలం బట్టి యువత ఎక్కువగా కోరుకొనే ఉద్యోగాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
1900 సంవత్సర సమయాలలో : లాయరు(న్యాయవాది)
1920 నుండి 1947 వరకు : స్వతంత్రయోధులు
1947 నుండి 1990 ల వరకు : ప్రభుత్వ ఉద్యోగాలు
1990 నుండి 2000 ల వరకు : ఉపాధ్యాయ ఉద్యోగాలు
2000 నుండి ఇప్పడు కూడా : సాప్ట్‌వేర్ ఉద్యోగాలు
తర్వాతో………….


హిందూ సంప్రదాయములోను, పురాణ గ్రంధాలలోను ఏడుగురు దివ్యశక్తి గల తపస్సంపన్నులను సప్తర్షులు అని ప్రస్తావించారు. భారత సాంప్రదాయిక ఖగోళ విజ్ఞానంలో ఏడు నక్షత్రాలను కూడా సప్తర్షులు అంటారు.
సప్తర్షుల లక్షణాలు వాయు పురాణము (16-13,14)లో ఇలా చెప్పబడినవి – దీర్ఘాయువులు, వేద మంత్రకర్తలు, దివ్యశక్తి సంపన్నులు, దివ్యదృష్టి గలవారు, సద్గుణ సముపేతులు, వేదశాస్త్రాది వివిధ విద్యా సమంచితులు, వయోవృద్ధులు, సర్వ ధర్మ మర్మజ్ఞులు, ధర్మ స్వరూపులు, గోత్ర ప్రవర్తకులు ఈ గుణములు గల మహర్షులు “సప్తర్షులు”గా ప్రసిద్ధి వహించిరి. వీరినుండియే వంశములు వృద్ధి చెందినవి, ధర్మ వ్యవస్థ సుప్రతిష్ఠమై సాగుచున్నది.
వీరి జీవన విధానము, భావములను వాయుపురాణంలో (61/95-97) ఇలా చెప్పారు.- అధ్యయనము, అధ్యాపనము, యజ్ఞములు చేయుట, యజ్ఞములు చేయించుట, దానములను ఇచ్చుట, దానములు తీసికొనుట అనే ఈ ఆరు కర్మలను నిత్యము ఆచరించేవారు, విద్యాబోధనకు గురుకులములు నడిపేవారు, సంతాన ప్రాప్తికే గృహస్థాశ్రమమును స్వీకరించిన వారు, అగ్నికార్యములు నిర్వహించేవారు, వర్ణాశ్రమ ధర్మాలననుసరించి వ్యవహారములను నడిపేవారు, స్వయముగా సంపాదించుకొనిన అనింద్య భోగ్య వస్తువులనే అనుభవించేవారు, సంతానము గలిగి గోధనాది సంపదలచే ఒప్పువారు, ప్రాపంచిక విషయాలపట్ల నిరాసక్తులు.
వీరు మన్వంతరానికి ఒకసారి మారుతుంటారు.
1.మొదటి మన్వంతరము,అధిపతి స్వాయంభువు,సప్తర్షులుThe Gods of Indian Mythology
మరీచి,అత్రి,అంగీరస,పులహ,క్రతు,పులస్త్య మరియు వశిష్ఠ
2.రెండవ మన్వంతరము,అధిపతి స్వారోచిషుడు,సప్తర్షులు
ఊర్జ,స్థంభ,ప్రాణ,దత్తోలి,నిస్చర,ఋషభ మరియు అర్వరివత్తు
3.మూడవ నన్వంతరము,అధిపతి ఔతమి
సప్తర్షులు కౌకునిది,కరుంది,దలయ,సాంఖ,ప్రవహిత,మిత మరియు సమ్మిత
4.నాల్గవ మన్వంతరము,అధిపతి తామస మను
సప్తర్షులు జ్యోతిర్ధామ,పృధు,కవ్య,చైత్ర,అగ్ని,వనక మరియు పివర
5.ఐదవ మన్వంతరము,అధిపతి రైవతమనువు
సప్తర్షులు హిరణ్యరోమ,వేదశ్రీ, ఊర్ధబాహు, వేదబాహు, సుధామ, ఫర్జన్య మరియు మహాముని.
6.ఆరవ మన్వంతరము,అధిపతి చక్షూసమనువు
సప్తర్షులు శుమేధస్సు, విరాజస్సు, హవిష్మత్, ఉత్తమ, మధు, అభినామన్ మరియు సహిష్ణు.
7.ఏడవ మన్వంతరము,అధిపతి వైవస్వతమనువు (ఇది ప్రస్తుతకాలం)
సప్తర్షులు కష్యప, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ.