భారతదేశపు అత్యంత పవిత్రమైన గంగా నదీ తూర్పు పరివాహక ప్రాంతంలో కొలువుదీరి ప్రపంచంలోనే అతిపురాతనమైన నగరంగా పేరొందిన వారణాసి భారతదేశపు సాంస్కృతిక రాజధానిగా భాసిల్లుతోంది. వారణాసి నగరం నడిబొడ్డులో నెలకొన్న కాశీ విశ్వనాథ దేవాలయం శైవ జ్యోతిర్లింగాలలో ఒకటిగా భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కాశీ విశ్వేశ్వర దేవాలయం సంప్రాప్తించుకుంది.
స్త్రీ పురుషులు, పిల్లలు వృద్ధులు అనే తారతమ్యాలుకు చోటు లేకుండా, కులమతాలకు అతీతంగా ఎవరైనా కావచ్చు వారాణాశిని సందర్శించి గంగా నదిలో స్నానం చేసినట్లయితే మోక్షాన్ని పొందుతారని హిందూ పురాణేతిహాసాలు పేర్కొంటున్నాయి. కనుకనే జీవితకాలంలో ఒక్కసారైనా కాశీని సందర్శించాలనేది హిందువుల జీవితేచ్చ.
ధార్మిక ప్రాధాన్యత
భూగోళం అవతరించిన సమయంలో తొలి కాంతి కిరణం కాశీపై పడింది. అప్పటి నుంచి జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అంశాల నెలవుగా పుణ్య క్షేత్రమైన కాశీ పేరుగాంచింది. పురాణాలను అనుసరించి అనేక సంవత్సారాలు ప్రవాసంలో గడిపిన పరమశివుడు వారాణాసికి విచ్చేసి తన నివాసంగా మార్చుకున్నాడని ప్రతీతి. పది అశ్వాలతో కూడిన రథాన్ని దశాశ్వమేథ ఘాట్‌కు పంపడం ద్వారా బ్రహ్మదేవుడు బోళాశంకరునికి స్వాగతం పలికాదు
No comments:
Post a Comment