శ్రీకైవల్యసారథి" అనే పుస్తకంలో డాక్టర్ క్రోవి సారధి ఇలా వ్రాశాడు-
"ఏ మహాత్ముని రూపం నీకు మదిలో నిలిచిపోతుందో,
ఏ సన్యాసి నీకు స్వప్నంలో కూడా కనిపించి సన్మార్గాన్ని బోధిస్తాడో,
ఏ సాధువు చెప్పిన ధర్మసూత్రాలు నీ మదిలో నిలిచిపోతాయో,
ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ సందేహాలు నివృత్తి అవుతాయో,
ఏ వ్యక్తి దగ్గర నీకు ప్రశాంతత, ఆనందము కలుగుతాయో,
ఏ వ్యక్తిమీద నీకు నమ్మకము, గురి కలుగుతాయో ...
ఆ మహనీయుడే నీకు గురువు"
ఏడు రకాల గురువులు శాస్త్రాలలో చెప్పబడ్డారు.
1.సూచక గురువు - చదువు చెప్పేవాడు
2.వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు
3.బోధక గురువు - మహామంత్రాలను ఉపదేశించేవాడు
4.నిషిద్ధ గురువు - వశీకరణ, మారణ ప్రయోగాళు నేర్పేవాడు
5.విహిత గురువు - విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు
6.కారణ గురువు - జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు
7.పరమ గురువు - జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాణ్ని కలిగించేవాడు.
గురువులు ఇచ్చే దీక్ష నాలుగు రకాలని చెబుతారు -
(1) స్పర్శదీక్ష (2) ధ్యాన దీక్ష (3) దృగ్దీక్ష (4) మంత్రదీక్ష.
శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారముగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీత ను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. మనము అందుకే " కృష్ణం వందే జగద్గురుం" అని శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిస్