Total Pageviews

Sunday, September 26, 2010

k y v: streelu enduku vedam chedavakuudadu ?

k y v: streelu enduku vedam chedavakuudadu ?: "పూర్వం త్వస్ట్రా అను ఒక పురోహితుడు ఉండేవాడు. పురూహితుదంటే యగ్నాలు,యాగాలు మామూలే ఒకసారి ఇంద్రాలోకంలో సభ జెరుగుతూ ఉన్న్డగా అగ్గ..."

streelu enduku vedam chedavakuudadu ?





పూర్వం త్వస్ట్రా అను ఒక పురోహితుడు ఉండేవాడు. పురూహితుదంటే యగ్నాలు,యాగాలు
 మామూలే ఒకసారి ఇంద్రాలోకంలో సభ జెరుగుతూ ఉన్న్డగా 
 అగ్గ్ని దేవుడు రాలేదు ఏమిటా  అని ఆరా తీస్తే భులూకంలో త్వస్ట్రా చేసే యాగంలో
 హోతగా ఉండడం చూసి దేవతలు ఎవరా మానవుడు.......
 తన శేక్తితో దేవతలనే తన పరిచారకులగా ఉంచుకునాదంటే చాలా శేక్తిమంతుడై 
 ఉండాలి ఆనుకుంటున్న సమయంలో  రాక్షసుల గురువు ఇన శుక్రాచార్యులవారు
 దేవతలా ఊహను గ్రహించి  ఒక పదకాన్ని రచించారు. ఆది తెలియని దేవతలు
 ఈ త్వస్ట్రా  మాయలో పది ఆటను నిత్యం ఇచ్చే సోమం పుచుకుని మత్తులో
 ఉన్న్డేవారు ......  ఈ సమయంలో భూలోకంలో ఆత్యంత అందమైనా
 బ్రాహ్మణ కుటుమ్బంమ్లో గల ఒక స్త్రీ ;త్వస్ట్రా కు ఎదురు పడింది  తనను పెళ్లి 
చేసుకోమ్మనగా తను కొన్ని షరతులతో పెళ్ళిచేసుకుంది .
 సరే పెళ్లి ఇయాక కొంతకాలానికి కొడుకు పుట్టాడు ఆ అబ్బాయికి
 త్వాస్ట్రా అని నామకరణం చేశారు.పిల్లవాడిని చూడటానికి మేన మామలు
 రానే వచారు ఆయనతో  ఇలా అన్నారు. బావగారు మీరు నిత్య ఆగ్గ్ని హూత్రులు
.మీరు ఏమి అనుఖోనన్న్టే. మీ అబ్బాయిని మేము చేదివించతళిచము అన్నారు
.వారి కోరిక ప్రకారం  పిల్లవాడు వాళ్ళ మేన మామ దేగ్గరా భాగావేద
విద్యనూ అబ్భ్యసించాడు ఆతనికి ముఉడు తలలు  ఉండేవి వాటికి కుడా
పేర్లు ఉన్నాయ్ అవి  సోమపానం,సురాపానం,అన్నాదనం.తను బాగా చెదివి
 తండ్రిని మించిన తనయుడిగా పెరుతెచుకున్నాడు.కాని ఆటను నేర్చుకున్నది
 దేవతలకు ఉపయోగాపడక అసురులకు ఈ హవిర్భాగం వెళ్లి పోతున్నడని 
తెలుసుకున్నఇంద్రుడు  తన వజ్రాయుధంతో  త్వాస్ట్రా యొక్క మూడు తలలు నరికేశాడు
.నరికిన వెంటనే నారదులవారు వచ్చి ఇంద్ర ఆటనితిట్టురులు[మెదడు]
 కింద పదనియకు ఆది కింద పడితే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది
 అని వారు చెప్పగా ఆ ముఉడు తిట్టరులను తన చేతులతో పట్టుకుని అలాగే ఎన్నోసంవత్సరాలు
 గడిపాడు ఇంద్రుడు.మేగితా దిక్పాలకులు  ఇంద్రుడి దెగ్గరకు వచ్చి
 ఆర్య మీరు ఇలానే పట్టుకుని ఉంటె లోకాలను పాలించేది ఎవరు స్వామి.
 ఎంత కాలం మీరు ఇలా ఉన్న్టారు. ఎవరోక్కరికి ఈ పాపాన్ని ఏవరికైనా
 ఇచేయండి అన్నారు మీగిలిన దేవతలు అప్పుడు ఇంద్రుడు అన్న్దరిని
 ప్రార్దించాడు ప్రేటి ఒక్కరు మేము తిసుకోమంటే మేము తీసికోమని 
ఖరాఖడిగా చెప్పేశారు. చివరకు భూదేవిని అడిగారు . ఆవిడ మూడు
  కాదు నేను ఒకటి తీసుకుంటా .దానికి ప్రతిఫలంగా నాకు ఒక వరమివాలి అని కోరింది 
.ఏమిటా కోరికా ?అని ఇంద్రుడు ఆడిగాడు స్వామి నామీద భూలోక వాసులు గుంటలు
 తవ్వి నన్ను బదిస్తున్నారు .ఈకడ ఐతే గుంటలు తవ్వర్హో అక్కడ వత్సరం
 తిరగక ముందే అది పుడుకుఫోవాలి .అని ఆడిగింది తథాస్తు అన్నాడు ఇంద్రుడు
  వెంటనే ఆ పాపం భూమిమీద ప్రభావం చూపింది బీడు భుమిలగా ...
.రెండవ పాపం వృక్షాలు తీసుకున్నవి వాటికీ ఒక వరమిచాడు ఇంద్రుడు
. ఎక్కడైతే చెట్టు కొమ్మనరుకుతార్హో అక్కడ చిగుర్హోచి కొమ్మవచేటట్టు
 వరమిచాడు. ఆపాపం చెట్టు నుంచి వచ్చే జిగురు [గం] ఇకచివారి పాపం ఏవరు
 తీసుకుంటారని అందరిని ఇంద్రుడు ఆడుగుతున్నాడు .చివరకు ఆడవారు వచ్చారు
 మేము ఆ పాపం తీసుకుంటాం .మాకొక కోరికుంది అది తిరుస్తే మేము సిధం
. అన్నారు ఏమిటి మీ ఖోరిక అని ఆడిగారు.స్వామి మాకు మా పతుల యొక్క
 ద్రుష్టి చేతనే మేము తల్లులం అవుతున్నాం.[కుంతీ దేవి తనకు పెళ్లి కాకుండా
 మన్ర శేక్తితో బిడ్డలను కానీ పుత్రా శోకంతో ఎలాభాదపదిందో మనల్హో చాలామందికి తెలుసు ]
 దాని నుంచి మమ్మలను రక్షిస్తానంటే మేము ఈ పాపం తీసుకుంటాం
 .అన్నారు స్త్రీలు దానికి ఇంద్రుడు తథాస్తు ఆనకతప్పలేదు 
.ఇంద్రుడు స్స్త్రీలకు ఆ పాపం [బయట చేరటమనే] ప్రక్రియ మన ఇల్లాల్హో
  చాలా వరకు కనిపిస్తుంది.ఆ బ్రమ్హహత్యపాటకం  చుట్టుకున్నందుకు
 వీరు మువ్వురికి వేద అర్హత కొల్ఫోవలసి వచ్చింది .మనం వేద పారాయణం 
చేస్తున్నప్పుడు నేలమీద  కూర్చోకూడదు .మనం తినేతిన్డిలో ఇంగున
 వేసుకోకూడదు [ఇంగువ... చెట్టు గం నుంచే వస్తుంది ]  స్త్రీలు బయట
 చేరినప్పుడు వారిని తాకకుడదని మనకు తెలిసిందే.స్త్రీలు వేదం చెదవకుదధనీ
 అప్పటినుంచి .తీర్మానించబడింది .ఇక ఇంద్ర ల్హోకంల్హో త్వాస్త్ర తండ్రి ఐన
 త్వస్త్ర ఇంద్రుడి మీద కోపంతో ఒక యాగం ప్రారంభించాడు ఇంద్రుని జయించటానికి సరే
 నన్నది మరి అది వేరే కథలోకి పోతున్నది మీకు ఈ విషయం దేనిల్హో ఉన్నది
 అంటే క్రిష్ణఎజుర్వేద తైత్తిరీయ సంహిత ల్హో రెండవ కాండ ఐదవ ప్రేశ్నలో
 ఈ విషయం చెప్పి ఉన్న్టున్న్ది............ మరి మీకు ఏదినా  ఆడగాలని ఆనిపిస్తీ వెంటనే కామెంట్లో పెట్టండి  
మీ Somayaagam
రాళ్ళపల్లి పవన్ 

Tuesday, September 14, 2010

1.మొదట మన వేదాలను గమనిద్దాము.వేదాలను అనుసరించే ఈ సిద్దాంతాన్ని ఆంగ్లేయులు ప్రతిపాదించారు.కాని వేద పరిబాషలో ఆర్యుడు అనగా గౌరవ వాచకం.ఉత్తమ నడవడిక,మంచి వ్యక్తిత్వానికి ఇచ్చే గుర్తింపు.అంతే కాని ఈ పదాన్ని జాతిని సూచించేదిగా ఎక్కడా వేదాలలో ఉపయోగించలేదు.
అన్నిటికన్నా ముఖ్యంగా వేదాలలో వలస విషయం కాని,దండయాత్ర విషయం కాని ఎక్కడా చెప్పబడలేదు.
దస్యుడు అనగా మంచి నడవడికలేని వాడని అర్థము.
వేదాలలో కాని,పురాణేతిహాసాలలో కాని ఆర్యావర్తము లేక ద్రవిడ ప్రదేశం అని ప్రాంతాలను బట్టి మాత్రమే పేర్లు పెట్టడం జరిగింది.
ఇక రావణుడు ద్రావిడుడని,రాముడు ఆర్యుడని అపార్థం చేసుకొన్నారు.అపార్థం అని ఎందుకు అన్నానంటే దీనికి ఋజువుగా వాల్మీకి రామాయణంలో మండోదరి రావణుడిని “ఆర్యపుత్రా” అనే సంబోధిస్తుంది.రామాయణమును పూర్తిగా చదివిన వారెవరైనా ఈ విషయాన్ని చూడవచ్చు.
2.ఆంగ్లేయులు ఎలా ఈ సిద్దాంతానికి పథకం రచించారో కొన్ని ఋజువులు.
అ)1866,ఏప్రిల్ 10 వ తేదీ లండన్ లోని “రాయల్ ఏషియాటిక్ సొసైటీ” రహస్య సమావేశ తీర్మానం
“ఆర్య దండయాత్ర సిద్దాంతం భారతీయుల మనసులలోనికి ఎక్కించాలి.అలగైతేనే వారు బ్రిటిష్‌వారిని పరాయి పాలకులుగా భావించరు.ఎందుకంటే అనాదిగా వారిపై ఇతర దేశస్థులు దండయాత్రలు జరిపారు.అందువలన మనపాలనలో భారతీయులు ఎల్లకాలం బానిసలుగా కొనసాగుతారు.”
(వనరు:Proof of Vedic Culture’s global Existence – by Stephen Knapp.page-39)
ఆ)మ్యాక్స్‌ముల్లర్ 1886లో తన భార్యకు వ్రాసిన ఉత్తరం
“నేను ఈ వేదం అనువదించటంలో భారతదేశపు తలరాత “గొప్పగా” మారబోతూ ఉంది.అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.ఈ వేదం(ఋగ్వేదం) వారి మతానికి తల్లివేరు.3000 ఏళ్ళ నాటి వారి నమ్మకాలను పెకలించి వేస్తుంది.”
(వనరు:The Life and Letters of the Rt.Hon.Fredrich Max Muller,edited by his wife,1902,Volume I.page 328)
విశేషం ఏమంటే 1746-1794 మధ్య కలకత్తా లో భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన “విలియం జోన్స్”,మ్యాక్స్ ముల్లర్ గార్లే ఈ “ఆర్య” శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
3.ఇక భారతీయుల పరిశోధనలు చూద్దాం.
1946లో అంబేద్కర్ రచించిన “Who were the sudras?” అనే పుస్తకంలో శూద్రులు-ఆర్యులు అని ఒక అద్యాయం రచించాడు.అందులో ” పాశ్చాత్యులు సృష్టించిన “ఆర్యజాతి” సిద్దాంతం ఏ రూపంలోనూ నిలబడలేదు.ఈ సిద్దాంతాన్ని పరిశీలిస్తే లోటుపాట్లు రెండు విధాలు గా కనిపిస్తాయి.అవి ఒకటి ఈ సిద్దాంతకర్తలు తమ ఇష్టానుసారంగా ఊహించుకొన్న ఊహల నుండి గ్రహించుకొన్న భావనలు గానూ,రెండు.ఇది మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగానూ,నిజాలను గుర్తించకుండా మొదటే ఒక సిద్దాంతం అనుకొని దానికి అనుగుణమైన ఋజువులు చూపిస్తున్నట్లు ఉంది”
Secrets of vedas అనే గ్రంథమును అరవిందులు రచించారు.ఇందులో “ఆర్యుల సిద్దాంతం గురించిన హేతువులు,ఋజువులు వేదాలలో అసలు కనిపించవు.అసలు వేదాలలో ఆర్యుల దండయాత్ర గురించి అసలు ఎక్కడా లేదు”.
4.సైంటిఫిక్ ఋజువులు:
1920లో బయటపడిన “సింధు నాగరికత”తవ్వకాలతో ఆర్యుల దండయాత్ర సిద్దాంతం తప్పని ఋజువైంది.హరప్పా,మొహంజదారో
మొదలైన స్థలాలు,లోతల్ రేవు,వీటి నగర నిర్మాణ రీతులు మరెన్నో ఆనవాళ్ళు భారతదేశంలో 10వేల సంవత్సరాలుగా ఉన్నతస్థాయిలో వర్ధిల్లుతున్నది అని ఋజువులు చూపిస్తున్నాయి.బ్రిటిష్‌వారి ప్రకారమే మహాభారతం ఇప్పటికి 5000 సంవత్సరాల క్రిందటిది.మన అందరికి తెలుసు రామాయణం అంతకంటే ముందరిది.ఒక వేళ రామాయణ ప్రామాణికతను ఎవరైనా ప్రశ్నించినా వేదాల ప్రామాణికతను ఎవరూ ప్రశ్నించలేదు.వేదాలు మహాభారత కాలం కన్నా ఎంతో ముందని తెలుసు.మరి ఆ వేదాలలోనే “ఆర్య” శబ్దం ఉన్నదనీ తెలుసు.అటువంటిది ‘గుర్రాలపై దండెత్తి” ఆర్యులు ద్రావిడులను 3500(క్రీ.పూ 1500 నుండి క్రీ.పూ 100 మధ్య) సంవత్సరాల క్రిందట తరిమికొట్టారన్నది ఏ మాత్రం అర్థం లేనిది.
1980లో ఉపగ్రహాల ద్వారా ‘సరస్వతీ’ నది ప్రవహించిన ప్రాంతాన్ని చిత్రాల ద్వారా గుర్తించారు. ఋగ్వేదంలో చెప్పినట్లు ఈ ప్రవాహ మార్గం ఖచ్చితంగా సరిపోతోంది. వేద నాగరికత సరస్వతీ నదీ తీరంలో వెలసినది అని వేదాలు మనకు చెబుతున్నాయి.కాని బ్రిటిష్‌వారు ఈ నదిని ఒక ఊహగా,వేదాల సృష్టిగా చిత్రీకరించారు.
ముఖ్య విషయం ఏమిటంటే సైంటిఫిక్ గా కానీ,చారిత్రికంగా కానీ ఆర్యుల దాడి కి సంబంధించిన ఆధారాలు ఇంతవరకూ లేవు.
ఇక ఉత్తర భారత,దక్షిణ భారత ప్రజల శరీర నిర్మాణం,రంగుల విషయానికి వస్తే ఉత్తర భారతదేశం హిమాలయాలు ఉండడం వలన అధిక చల్లదనాన్ని కలిగిఉంది.దక్షిణ భారతదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం వలన వాతావరణం వేడి గా ఉంటుంది.అందువలనే ప్రజల భౌతిక రూపాలలో తేడాలు ఉన్నాయి.ఒకే రాష్ట్రం లో ని ప్రజల ఒకే బాషలో తేడాలు(యాస),ఆచారాలలో తేడాలు ఉన్నప్పుడు విశాల భారతదేశంలో ఆచారవ్యవహారాలలో తేడాలు ఉండడం విషయం కాదు.ఉదాహరణకు తమిళనాడులోనూ,ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలోనూ పెళ్ళికూతురుని ఒక గంపలో కూర్చుండబెట్టి పిలుచుకురావడమనే ఆచారం ఉంది.కాని ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలోనే ఈ ఆచారం లేదు..ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు.
ఈ చర్చ నిజానిజాల పరిశీలన కొరకు ఉద్దేశించినది కాబట్టి వారి వారి అభిప్రాయాలు ప్రకటించండి.

Friday, September 10, 2010


వేదములే మన మనుగడకు ఆధారము. ఇది అందరకు తెలిసిన విషయము. కొద్ది మందికి మాత్రమే తెలిసిన లోతైన విషయమును, నలుగురికి తెలియచేసే అవకాశము కల్పించిన వారికి ధన్యవాదములు.
నాల్గు వేదములలో, ప్రతి వేదమును రెండు భాగములుగా విభజించ వచ్చు. మొదటి భాగము కర్మ ఖాండ కాగా, రెండవది లేక చివరి భాగము అయినవి వేదాంతములు అని చెప్తారు. వీటినే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని కూడా తెలుసుకొన వచ్చు.
ప్రతి వేదములోని ప్రధమ భాగములో,కర్మ ఖాండ విషయములు అనగా ధర్మ భద్ధంగా మనిషి యొక్క జీవన విధానాన్ని నిర్ధేశించబడి వున్నాయి. దీని ఆధారముతోనే మనుస్మ్రుతి (మనువుచే వ్రాయబడినది),ధర్మ సూత్రములు( జైమిని కారులచే వ్రాయబడినవి)వచ్చాయి. యోగాదులు,ధ్యానం, ఆయుర్వేదం, ఇది అది అని చెప్పనవుసరము లేదు. హైందవ సాంప్రదాయంలో మానవునికి కావలసిన అన్ని ధర్మ సూక్ష్మములు ఇక్కడే లభ్యం.దీనినే అపర విద్య అని చెప్పారు. ఇది క్లుప్తంగ ఇంత వరకు తెలుసుకుందాము.
ఇక రెండవది ఉత్తర భాగం. దీనినే ఉపనిషత్తులు అని చెప్పారు. ఈవిద్య పర విద్య. వేయికి పైగా ఉపనిషత్తులు ఉండగా, 108 మాత్రము బాగా లభ్యము కాగా, అందులో 10 ఉపనిషత్తులు, అంటే దశోపనిషత్తులు మాత్రము ముఖ్యముగా ప్రాచుర్యము పొంది వున్నాయి. ఈ దశోపనిషత్తులకు మాత్రమే, ఆదిశంకరులవారు వ్యాఖ్యానములు వ్రాసి వున్నారు. అవే మనకు రక్ష అయి వున్నాయి. పరమాత్మ, సృష్టి కర్త అయిన భగవంతుని యథార్థ ఉనికి తెలుసుకోదలచిన వారికి ఇవే శరణ్యం. ఇందలి రహస్యములను, సూత్రములుగా వ్రాసినారు వేదవ్యాసభగవానుడు. ఆవే బ్రహ్మసూత్రములు. వీటికి గూడ భాష్యము వ్రాసినారు ఆదిశంకరులవారు.
ఈ పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని చెప్పబడే ఈ వేదములు, పరాపర విద్యలని తెలుసుకోవాలి. ఇవి యెవరో ఒక వ్యక్తిచే గాని, మరేదయినా పద్ధతిలో వ్రాయబడి వుండలేదు. కేవలము వినపడినవి. శ్రవణములు మాత్రమే. అందుకే వానిని అపవురుషేయములని అన్నారు. అనగ ఏ మానవుని సృష్టి కాదు. ఈ భాగమునకు రాగానే, గురువుగారు, మునుపటి భాగములో చెప్పిన సర్వమును ఖండించి, నేతి నేతి మాటలతో, జగన్మిథ్య,(అనగా జగత్తు పరమాత్మచే కల్పితము మాత్రమే) అనియు, పరమాత్మయే సత్యమ్ అని భోధించుతారు.ఇక్కడ కర్మ ఖాండ పూర్తిగ నిషేదించ బడుతుంది. కర్మ ఖాండ నిషేదమునకు ఒప్పుకొ గల్గిన, శమ దమాదులు కల్గిన మనస్సునకు మాత్రమే ఈ శాస్త్రము అబ్బుతంది.
పూర్వపు రోజులలో, వర్ణాశ్రమ ధర్మము ననుసరించి, బ్రంహచర్యములో గురుకులములకు వెళ్ళి, వర్ణముతో నిమిత్తము లేకుండ, విద్యనభ్యసించ వలెను. తరువాత గృహస్తాశ్రమములో తాము మునుపటి ఆశ్రమములో అభ్యసించిన విద్యతో, ధర్మమార్గములో జీవనము సాగించెడివారు. వర్ణాశ్రమ ధర్మములను గురించి ఇంకను వివరముగ చెప్పవలసి వున్నది.
ఈ బాటలోనే శ్రీకృష్ణ పరమాత్మ, తన బాల్యములో, బ్రంహచర్యాశ్రమము ననుసరించి, సాంధీప మహాముని గురుకులములో తన సహపాటీలు కుఛేలుడు, అన్న బలరాముడు తో కలసి పర అపర విద్యలను అభ్యసించాడు. ఆ విద్యను, అర్జునునకు యుధ్దభూమిలో భగవద్గీతగా చెప్పినాడు. అందువలననే గీత ఉపనిషత్ సారాంశము అయినది. అందులో పర్ అపర విద్యలు (అపర విద్య = కర్మఖాండ,పర విద్య = పరమాత్మ యొక్క యధార్థ ఉనికి) ధర్శనమిస్తయి. అంటే జీవన విధానము + జీవన రహశ్యము, ఈ రెండు తప్ప ఇతర విషయములకు తావు లేదు.
ఈ రెండు విద్యలను, రాముల వారు తన బాల్యములో వశిష్టుల వారికి శిష్యుడయి, అభ్యసించి నాడు. అదే యోగవాశిష్టము అయినది.దానిని గీత అన్నను సరియే అగును. కనుక ఈ విద్య గురు శిష్య పరంపరగా ఈనాటికి సాగుతూ వస్తున్నది. ఇది మరుగు పడుట, ఏమైపోతుందో ననే భయము అక్కరలలేదు. రహస్యమేమిటి. ఇది ఆతని అనగా పరమాత్మ యొక్క ఉనికిని చాటే శాస్త్రము కనుక, తన శాస్త్రమునకు తానే రక్షకుడు. అలాగుననే ఈ జగత్తుకు తానే రక్షకుడు

Monday, September 6, 2010


హిందూ మత పురాణాలు మత మార్పిడిని గూర్చి ఏమీ ప్రస్తావించకపోవడం మూలాన ఒక హిందువు మతం మారవచ్చా లేదా అనే విషయంలో భేదాభిప్రాయాలున్నాయ కానీ హిందూ మతాన్ని ఒక తత్వంగా, లేదా ఒక జీవన విధానంగా భావించేవారు, హిందూ నమ్మకాలను తమ జీవన విధానంలో ఇముడ్చుకున్నవారు ఎవరైనా హిందువులు కాగలరని చెబుతుంటారు. కొద్ది మంది మాత్రం హిందూ మతాన్ని ఒక జాతిగా పరిగణించడం వలన హిందువులకు జన్మించినవారు మరియు భారతదేశంలో జన్మించిన వారే హిందువులు కాగలరని విశ్వసిస్తారు. కానీ భారతదేశపు ఉత్కృష్ట న్యాయస్థానం మాత్రం, జాతి, వారసత్వాలతో ప్రమేయం లేకుండా, హిందూమత విశ్వసాల్ని అవలంబించే ఎవరినైనా హిందువులుగా పరిగణించవచ్చునని తెలుపుతోంది. చాలా సాంప్రదాయాల్లో ఆధ్యాత్మిక జీవనం దీక్ష అనే ప్రక్రియతో ప్రారంభమౌతుంది. కానీ హిందూ మతంలోకి మారడానికి ప్రత్యేక పద్దతులంటూ ఏమీ లేవు. ఏ మతాన్నైనా నిర్మల భక్తితో అవలంబించడం వలన భగవంతునికి చేరువ కాగలరు అనేది హిందూమతం యొక్క ముఖ్య సూత్రం. అందువల్లనే హిందువులు ఇతర మతాల వారిని తమ మతంలో చేరమని బలవంతం చేయరు. అయినప్పటికీ కొన్ని హిందూ మత సంస్థలైన వేదాంత సమాజం,ఇస్కాన్ఆర్య సమాజ్ మున్నగునవి విదేశాలలో హిందూమత ప్రాశస్థ్యాన్ని గూర్చి ప్రజలకు వివరించి మార్గ నిర్దేశం చేస్తుంటాయి

Thursday, September 2, 2010


యజుర్వేదము

యజ్ఞపరాలైన మంత్రాలకు యజస్సులు అని పేరు. యజుర్వేదంలో 109 షఖలున్నయి. అన్దున అన్నె నసిన్ఛగ మనకు మిగిలినవి 2 షఖలు. ===మైత్రాయనియము (తైత్తిరీయము)=== ఇప్పుదు మైత్రయనియము కుద కాలగర్భమ్లొ కలసి పొతొన్ది మన తరువఅత తరమ్ వారికి మెగిలెది ఏమి ఉన్న్దదు రక్షిన్ఛవలసిన భధ్యత మనది ఇది చాలావరకు గద్యరూపంలో ఉంటుంది. దీనికి క్రియావిధులు ఉంటాయి.
  • దీనిలో బ్రాహ్మణాలు: తైత్తిరీయ, భార్గవ, కాత్యాయన, మైత్రాయణ, కరు

[]శుక్ల యజుర్వేదము (వాజసనేయము)

ఇది 40 అధ్యాయాలు గల గ్రంథం. యజ్ఞాలకు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ వేదం ముఖ్యంగా మాధ్యందినకాణ్వ సంప్రదాయాలలో ఉన్నది.
  • దీనిలో బ్రాహ్మణాలు:శతపథ
  • దీనిలో ఆరణ్యకము, ఉపనిషత్తు: బృహదారణ్యక

[

Wednesday, September 1, 2010

the rugveda


ఇది అన్నింటికంటె పురాతనమైనది, ముఖ్యమైనది. బహుశా ప్రపంచంలోనే అత్యంత పురాతన సాహిత్యం కావచ్చును. ఇందులో 21 అధ్యాయాలు ఉన్నాయి. స్తుత్యర్థకమైన మంత్రానికి ఋక్కు అని పేరు. మిగిలిన వేదాలలోని చాలా విషయాలు ఋగ్వేదానికి అనుసరణగానో, పునరుక్తిగానో ఉంటాయని చెప్పవచ్చును. ఋగ్వేదంలో 1028 దేవతా స్తుతులున్నాయి. వీటిలో అతి పెద్దది 52 పనసలు గలది. ఈ స్తోత్రాలన్నింటినీ 10 మండలాలుగా విభజించారు. తత్వ, అలౌకిక విషయాలను వివరించడంవలన పదవ మండలం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకొన్నది.
  • ఋగ్వేద బ్రాహ్మణాలు: ఐతరేయ, కౌశీతకీ, పైంగి, సాంఖ్యాయన
  • ఋగ్వేద ఆరణ్యకాలు: ఐతరేయ, కౌశీతకీ
  • ఋగ్వేద ఉపనిషత్తులు: ఐతరేయ, కౌశీతకీ